మీరు గెలవబోతున్నారంటూ మోదీకి ఫిబ్రవరిలోనే శుభాకాంక్షలు తెలిపా

SMTV Desk 2019-06-01 11:46:11  pm modi

మరోసారి నరేంద్ర మోదీ భారత ప్రధాని అవుతారనే నమ్మకం తనకు ఎప్పటి నుంచో ఉందని... ఇదే విషయాన్ని మోదీతో తాను ఫిబ్రవరిలో చెప్పానని, ముందస్తుగానే శుభాకాంక్షలు తెలియజేశానని ఇండియాలో కజకిస్థాన్ రాయబారి సర్సెన్ బయేవ్ తెలిపారు. రైజింగ్ ఇండియా ఈవెంట్ సందర్భంగా మోదీకి విషెస్ చెప్పానని అన్నారు. తమ దేశాధ్యక్షుడి తరపున కూడా శుభాకాంక్షలు చెప్పానని... ఎన్నికల తర్వాత మళ్లీ కలుద్దామన్నానని తెలిపారు.

గత ఐదేళ్లలో మోదీ ఎన్నో మార్పులు తీసుకొచ్చారని... ఈ ఐదేళ్లలో ఈ మార్పులను మరింత ముందుకు తీసుకెళతారనే ఆశాభావాన్ని సర్సెన్ బయేవ్ వెలిబుచ్చారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలంగా ఉన్నాయని అన్నారు. 2014లో 6వేల మంది భారతీయులకు తమ దేశ వీసాలను ఇచ్చామని... 2018లో 25వేల వీసాలను మంజూరు చేశామని చెప్పారు.