ఏపీ సచివాలయంలో సీఎం చాంబర్ కు వాస్తు మార్పులు!

SMTV Desk 2019-06-01 11:40:32  jagan

రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా సచివాలయం కూడా నిర్మించారు. అయితే, మొదటినుంచి ఏపీ సచివాలయం వాస్తు దోషాల మయం అని విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పట్లో చంద్రబాబు హయాంలోనూ అనేక మార్పులు చేయించినట్టు తెలుస్తోంది. తాజాగా ఏపీ సీఎంగా జగన్ వచ్చాక కూడా పలు వాస్తు లోపాలను గుర్తించారు.

ఈ మేరకు సచివాలయంలో యుద్ధప్రాతిపదికన వాస్తు మార్పులు చేయిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా, సచివాలయం మొదటి బ్లాక్ లో వాస్తు మార్పులు చేయాలని వైసీపీ అగ్రనేతలు సూచించినట్టు ఇటీవలే కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో సీఎం చాంబర్ లోకి వెళ్లే ఒక ద్వారాన్ని మూసివేయాలని నిర్ణయించారు. అంతేగాకుండా, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చాంబర్ లోనూ ఆగ్నేయ మూల వద్ద మార్పులు చేర్పులు చేస్తున్నారు.