కేంద్ర స్వతంత్ర మంత్రులకు శాఖలు ఖరారు.. ఎవరెవరికి ఏయే శాఖలంటే..!

SMTV Desk 2019-06-01 11:32:05  modi

నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం నిన్న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కొత్త కేంద్ర స్వతంత్ర మంత్రులకు కాసేపటి క్రితం శాఖలను కేటాయించారు. ఎవరెవరికి ఏయే శాఖలు దక్కాయంటే... (1) సంతోష్ కుమార్ గంగ్వార్: లేబర్ మరియు ఎంప్లాయ్ మెంట్ శాఖ (ఇండిపెండెంట్) (2) ఇందర్ జిత్ సింగ్: గణాంకాల శాఖ (ఇండిపెండెంట్), ప్రణాళిక శాఖ (ఇండిపెండెంట్) (3) శ్రీపాద్ నాయక్: ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ద, హోమియోపతి శాఖ (ఇండిపెండెంట్), రక్షణ శాఖ సహాయమంత్రి (4) జితేంద్ర సింగ్: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ (ఇండిపెండెంట్), ప్రధాని కార్యాలయం సహాయ మంత్రి... ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల సహాయ మంత్రి... అటామిక్ ఎనర్జీ సహాయ మంత్రి, అంతరిక్ష శాఖ సహాయమంత్రి (5) కిరణ్ రిజిజు: క్రీడలు, యువజన శాఖ (ఇండిపెండెంట్), మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (6) ప్రహ్లాద్ సింగ్ పటేల్: టూరిజం మరియు సాంస్కృతిక శాఖ (ఇండిపెండెంట్) (7) రాజ్ కుమార్ సింగ్: పునరుత్పాదక శక్తి శాఖ (ఇండిపెండెంట్), స్కిల్ డెవలప్ మెంట్ మరియు ఎంటర్ ప్రిన్యూర్ షిప్ శాఖ సహాయమంత్రి (8) హర్దీప్ సింగ్ పూరి: హౌసింగ్ మరియు అర్బర్ వ్యవహారాల శాఖ (ఇండిపెండెంట్), పౌర విమానయాన శాఖ (ఇండిపెండెంట్), పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ సహాయ మంత్రి (9) మన్షుక్ మండవీయ: షిప్పింగ్ (ఇండిపెండెంట్), కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ సహాయ మంత్రి