'సరిలేరు నీకెవ్వరు' ఓపెనింగుకి మహేశ్ బాబు అందుకే రాలేదట!

SMTV Desk 2019-06-01 11:28:42  mahesh

మహేశ్ బాబు 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనుంది. ఈ రోజునే హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమా దర్శక నిర్మాతలతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకి మహేశ్ బాబు రాకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

మహేశ్ బాబు ఈ ప్రారంభోత్సవ వేడుకకి రాకపోవడానికి కారణం సెంటిమెంట్ అని తెలుస్తోంది. సినిమా ఓపెనింగ్ రోజున తాను వస్తే ఆ సినిమా సరిగ్గా ఆడదనే సెంటిమెంట్ మహేశ్ బాబుకు ఉందట. అందువల్లనే ఆయన ఈ సినిమా పూజా కార్యక్రమాలకి హాజరుకాలేదని అంటున్నారు. ఇంతకుముందు చేసిన అరడజను సినిమాలకి కూడా ఆయన ఓపెనింగ్ రోజున రాలేదు. అదే సెంటిమెంట్ ను ఈ సినిమా విషంయలోను ఫాలో అయ్యాడన్న మాట.