చైనాలో లాంచ్ అయిన మీజు 16ఎక్స్ఎస్

SMTV Desk 2019-06-01 11:24:48  Meizu 16Xs

ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ మీజు మరో ఫోన్ ను రిలీజ్ చేసింది. మీజు 16ఎక్స్ఎస్ పేరుతో దీన్ని చైనా మార్కెట్లో ముందుగా అందుబాటులోకి తీసుకురానుంది. తర్వాత భారత్‌ మార్కె్‌ట్‌లోకి వస్తాయి. మీజు 16ఎక్స్ఎస్ స్మార్ట్‌ఫోన్‌ ధర దాదాపు రూ.17,000 నుంచి ప్రారంభమౌతోంది. 6 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది. 6 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ వేరియంట్ ధర దాదాపు రూ.20,000. జూన్ 10 నుంచి ఈ స్మార్ట్‌‌ఫోన్లు చైనా మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తాయి. ఫోన్‌లో 6.2 అంగుళాల స్క్రీన్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా (48 ఎంపీ+8 ఎంపీ+5 ఎంపీ), 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ప్రత్యేకతలున్నాయి.