మోటో జెడ్4 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్

SMTV Desk 2019-06-01 11:23:54  moto z4

స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ మోటరోలా మరో కొత్త ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. మోటో జెడ్4 పేరుతో ప్రస్తుతం అమెరికా, కెనడాలలో మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇక భారత్ లో వచ్చే నెల నుండి లభ్యమవనున్నాయి. మోటరోలా మోటో జెడ్4 స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.34,900. 4 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ వేరియంట్‌కి ఈ ధర వర్తిస్తుంది. జూన్ 6 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తాయి. అమెరికాలో ప్రిఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మోటో జడ్4 ఫోన్‌లో సింగిల్ నానో సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్, 6.4 అంగుళాల స్క్రీన్, ఓఎల్ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 48 ఎంపీ రియర్ కెమెరా, 25 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ, మోటో మోడ్ సపోర్ట్ (వీటి ద్వారా 5జీ నెట్‌వర్క్ పొందొచ్చు) వంటి ప్రత్యేకతలున్నాయి. అయితే ఈ ఫోన్ ను అధికారికంగా లాంచ్ చెయ్యకముందే అమెజాన్ విక్రయానికి ఉంచిన సంగతి తెలిసిందే.