యావత్ ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తా

SMTV Desk 2019-06-01 11:22:56  jagan mohan reddy,

ఏపీలో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలలో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో ఉన్నా గెలుపు మాత్రం వైసీపీనే వరించింది. అయితే ఫలితాల ముందు వెలువడిన చాలా సర్వేలలో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పినట్టుగానే అనూహ్య మెజారిటీతో విజయం సాధించింది. అయితే టీడీపీ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని సర్వేలు తమ ఫలితాలను తెలిపాయి. అయితే వైసీపీ ధాటికి టీడీపీ ప్రభుత్వం నిలవలేకపోయింది.

అంతేకాదు టీడీపీకి మంచి పట్టు ఉన్న స్థానాలను కూడా తమ ఖాతాలోకి వేసుకుంది వైసీపీ. అయితే వైసీపీ అధినేత జగన్ నిన్న విజయవాడలో గవర్నర్ సమక్షంలో ఏపీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వేలాది మంది జన సంద్రోహం నడుమ జగన్ తన ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేసి ప్రసంగాన్ని మొదలు పెట్టాడు. అయితే ఈ ప్రసంగంలో తాను అమలు చేసే పథకాలు, తాను హామీ ఇచ్చిన పథకాల గురించి కాసేపు మాట్లాడాడు. అనంతరం తనపై ఉన్న అభిమానంతో, తనని గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సభను ముగించాడు జగన్. అయితే నేడు జగన్ తన ట్విట్టర్‌లో ఒక ట్వీట్ కూడా పెట్టాడు. నాకు ఈ ఎన్నికలలో ఏపీ ప్రజలు భారీ విజయాన్ని అందించారని, ఈ విజయంతో నాకిప్పుడు మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. మీ అందరి నమ్మకాన్ని నిలబెడుతూ మంచి పాలన అందిస్తానని యావత్ ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తానని అన్నారు.