నేడు వెల్లడి కానున్న గత ఆర్థిక సంవత్సరం జిడిపి గణాంకాలు

SMTV Desk 2019-05-31 15:40:07  gross domestic product, narendra modi

ముంబై: నేడు వెల్లడించనున్న గత ఆర్థిక సంవత్సరం జిడిపి గణాంకాలతో మోడీ పాలనలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలియనుంది. అయితే మోడీ నేతృత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పెట్టుబడులు పెరగడం, జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి ఇలా రెండింటిలోనూ పునరుద్ధరణ ఉంటుందని విశ్లేషకులు భావిస్తునారు. చాలా మంది క్యూ4 జివిఎ(గ్రాస్ వాల్యూ యాడెడ్) 6 శాతం కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు, 2017 జూన్ త్రైమాసికంలో ఈ స్థాయిని చివరిసారిగా చూశారు. జివిఎ ఈ స్థాయిలో ఉంటే, ఇది 2018 మార్చిలో 7.9 శాతం వృద్ధి నుంచి వరుసగా త్రైమాసికాల్లో పతనం ఉందని సూచిస్తుంది. హెచ్‌ఎస్‌బిసి సెక్యూరిటీస్ చీఫ్ ఎకనామిస్ట్ ప్రకారం, ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చినా, ఆర్థిక పరిస్థితులను మళ్లీ ప్రారంభ స్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆటోమొబైల్ అమ్మకాలు, సిమెంటు, ఉక్కు ఉత్పత్తి వంటివి గత మూడు నెలలుగా బలహీనపడ్డాయి. వాస్తవానికి పెట్టుబడి స్థాయిలలో చిన్న పురోగతి ఉన్నట్లు కనిపిస్తోంది.- స్థూల స్థిరమైన మూలధన ఏర్పాటు 28.9 శాతం నుండి 29.5 శాతానికి పెరిగింది. అయితే నాలుగో త్రైమాసిక గణాంకాల్లో ఈ అంకెలపై మరింత స్పష్టత వస్తుంది. 2013 ఆర్థిక సంవత్సరం నుంచి తొలిసారిగా ఎఫ్‌డిఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) పడిపోయాయి. గత ఆరేళ్లలో తొలిసారిగా 201819 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డిఐలు తగ్గాయి. టెలికామ్, ఫార్మా, ఇతర రంగాల్లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం దాదాపు 1 శాతం తగ్గి 44.37 బిలియన్ డాలర్లకు చేరాయి. 201718 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డిఐలు 44.85 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి. అయితే 201213 ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం 22.42 బిలియన్ డాలర్లు నమోదవగా, 201112లో 35.12 బిలియన్ డాలర్లతో పోలిస్తే అత్యంతగా 36 శాతం క్షీణించాయి. ఎంత త్వరగా పెట్టుబడి స్థాయి తిరిగి వస్తుందనే అంశంపైనే జిడిపి వృద్ధి పునరుద్ధరణ ఆధారపడి ఉంటుంది.