జులైలో హుందాయ్ తొలి ఎలక్ట్రిక్ కారు ‘కోనా’ ఎస్‌యువి

SMTV Desk 2019-05-31 15:30:20  hyundai,

న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లపై ద్రుష్టి పెట్టాయి. హుందాయ్ కూడా తన తొలి ఎలక్ట్రిక్ వాహనం ‘కోనా’ ఎస్‌యువిని ఈ ఏడాది జులైలో భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. భారత్ మార్కెట్లోకి హుందాయ్ కొత్త మోడళ్లను ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తోందని, కోనా ఎస్‌యువి ఎలక్ట్రిక్ వాహనాన్ని జులైలో విడుదల చేస్తామని హుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) సీనియర్ జనరల్ మేనేజర్ పునీత్ ఆనంద్ వెల్లడించారు. ఈ ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. దీని తర్వాత ‘గ్రాండ్ ఐ10’ ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.