నీరవ్ రిమాండ్‌పై విచారణ వాయిదా

SMTV Desk 2019-05-31 15:28:40  neerav modi

లండన్: దేశీయ బ్యాంకుల్లో అప్పు ఎగ్గొట్టి పారిపోయిన నీరవ్ మోడీని తిరిగి భారతదేశానికి అప్పగించే కేసుపై బ్రిటన్ కోర్టులో గురువారం విచారణ జరిగింది. నీరవ్‌ను ఇండియా పంపితే ఆయనను ఏ జైలులో ఉంచుతారో ధ్రువీకరించి 14 రోజులలోగా తెలియజేయమని కోర్టు భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) లో దాదాపు రెండు బిలియన్ డాలర్ల మేరకు నగదు అక్రమ లావాదేవీలు జరిపాడని నీరవ్‌పై కేసు ఉంది. ఇతనిని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టులో చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బున్త్‌నాట్ ముందు విచారణకు గురువారం హాజరు పరిచారు. ‘14 రోజులలోగా భారత ప్రభుత్వం సమాధానం చెప్పలేదు అనడానికి కారణం లేదు. ఇండియాలో ఆర్థర్ రోడ్ జైలు ఈ అభ్యర్థికి తగిన స్థలం’ అని జడ్జి పేర్కొన్నారు. నీరవ్ రిమాండ్‌పై తదుపరి విచారణను కోర్టు జూన్ 27కు వాయిదా వేసింది.