లాభాల్లో కోల్ ఇండియా

SMTV Desk 2019-05-31 14:03:12  coal india

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా మార్చి ముగింపు నాటి క్యూ4 ఫలితాల్లో నికర లాభం రూ.6,024 కోట్లతో 362 శాతం పెరిగింది. పోయిన ఏడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.1,303 కోట్లుగా ఉంది. ఈ ఏడాది విశ్లేషకుల అంచనాలును మించాయి. కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ.26,548 కోట్ల నుంచి రూ.28,546 కోట్లకు పెరిగింది. అంటే రెవెన్యూ 7.5 శాతం వృద్ధిని సాధించింది. 201819 ఆర్థిక సంవత్సరానికి ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్(ప్యాట్) రూ.17,462 కోట్లు సాధించింది. అంటే గతేడాదిలో రూ.7,038 కోట్ల ప్యాట్‌తో పోలిస్తే ఈసారి 148 శాతం పెరిగింది. ఫలితాల నేపథ్యంలో మార్కెట్లో కంపెనీ షేరు విలువ 0.76 శాతం పెరిగి రూ.252.90 వద్ద స్థిరపడింది.