కేంద్ర కేబినెట్ మంత్రులు...... ఎవరెవరికి ఏయే శాఖలంటే?

SMTV Desk 2019-05-31 14:01:34  modi

నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం నిన్న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కొత్త కేంద్ర కేబినెట్ మంత్రులకు కాసేపటి క్రితం శాఖలను కేటాయించారు. ఎవరెవరికి ఏయే శాఖలు దక్కాయంటే...నరేంద్ర మోదీ: ప్రధానమంత్రి. దీంతో పాటు అటామిక్ ఎనర్జీ, స్పేస్, ప్రజా ఫిర్యాదులు ఇతరులకు కేటాయించని అన్ని శాఖలు.

(1) రాజ్ నాథ్ సింగ్: రక్షణ శాఖ (2) అమిత్ షా: హోం శాఖ (3) నిర్మాలా సీతారామన్: ఆర్థిక శాఖ (4) ఎస్.జయశంకర్: విదేశాంగ శాఖ (5) నితిన్ గడ్కరీ: జాతీయ రహదారులు మరియు రోడ్డు రవాణా, చిన్న మధ్య తరగతి పరిశ్రమలు (6) రాంవిలాస్ పాశ్వాన్: వాణిజ్య శాఖ, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ (7) నరేంద్ర సింగ్ తోమార్: వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ (8) రవిశంకర్ ప్రసాద్: న్యాయ శాఖ, సమాచార శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ (9) హర్ సిమ్రత్ కౌర్ బాదల్: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ (10) తావర్ చంద్ గెహ్లాట్: సోషల్ జస్టిస్ మరియు ఎంపవర్ మెంట్ శాఖ (11) రమేష్ పోఖ్రియల్ నిశాంక్: మానవ వనరుల శాఖ (12) స్మృతి ఇరానీ: మహిళా శిశు సంక్షేమ శాఖ, టైక్స్ టైల్స్ శాఖ (13) హర్షవర్దన్: ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, ఎర్త్ సైన్సెస్ శాఖ (14) ప్రకాశ్ జవదేకర్: పర్యావరణం, అడవుల శాఖ, సమాచార ప్రసార శాఖ (15) పియూష్ గోయల్: రైల్వే శాఖ, పరిశ్రమల శాఖ (16) ధర్మేంద్ర ప్రదాన్: పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ, ఉక్కు శాఖ (17) ప్లహ్లాద్ జోషి: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బొగ్గు శాఖ, గనుల శాఖ (18) మహేంద్రనాథ్ పాండే: స్కిల్ డెవలప్ మెంట్ మరియు ఎంటర్ ప్రిన్యూర్ షిప్ శాఖ (19) ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి: మైనారిటీ వ్యవహారాల శాఖ (20) సదానందగౌడ: కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ శాఖ (21) గజేంద్రసింగ్ షెకావత్: జలశక్తి శాఖ (22) అరవింద్ గణపత్ సావంత్: భారీ పరిశ్రమలు (23) గిరిరాజ్ సింగ్: డైరీ, మత్స్య, యానిమల్ హస్బెండరీ శాఖ