ఇంగ్లాండ్‌, భారతే ఫేవరెట్లు!

SMTV Desk 2019-05-31 13:56:28  kevin peterson

ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌, భారతే ఫేవరెట్లు అని తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ఈ ప్రపంచకప్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ ఫేవరెట్ జట్లు. అయితే అంచనాల్లేకుండా బరిలో దిగుతున్న ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లను తక్కువ అంచనా వేయకూడదు. ఆ జట్లు కూడా స్టార్ ఆటగాళ్లతో ఉన్నాయి. కప్ సాధించే సత్తా ఆ జట్లకు ఉంది. తమదైన రోజున ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లు చెలరేగుతాయి అని తెలిపాడు. ఇంగ్లాండ్‌ జట్టు ప్రస్తుతం బాగుంది. ఇయాన్‌ మోర్గాన్‌ కెప్టెన్సీలో ఆ జట్టు విప్లవాత్మక మార్పులు సాధించింది. గతంలో మోర్గాన్‌తో కలిసి నేనూ ఆడాను. అతని ఆలోచనలు చాలా సానుకూల దృక్పథంతో ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. వారి ఆట తీరు ఆకట్టుకుంది. ఇంగ్లాండ్‌ జట్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. సొంతగడ్డపై ఆడడం కూడా ఓ సానుకూలాంశం. ఒత్తిడిని తట్టుకుంటే జట్టు కప్‌ సాధించొచ్చు అని కేపీ అభిప్రాయపడ్డాడు.