ఆయనకి హిట్ ఇచ్చేసి రుణం తీర్చుకుంటాను: అనిల్ రావిపూడి

SMTV Desk 2019-05-31 13:53:58  mahesh babu

మహేశ్ బాబు 26వ సినిమాగా సరిలేరు నీకెవ్వరు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "నా జీవితంలో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు ఇది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మహేశ్ బాబుగారిని నేను ఎప్పటికీ మరిచిపోలేను.

ఈ సినిమాతో ఆయనకి హిట్ ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటాను. ఈ సినిమాను దిల్ రాజు గారు .. అనిల్ సుంకరగారు .. మహేశ్ బాబుగారు కలిసి నిర్మిస్తున్నారు. 13 సంవత్సరాల తరువాత విజయశాంతిగారు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. నాపై నమ్మకంతో ఆమె ఈ పాత్ర చేయడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక మహేశ్ జోడీగా రష్మిక .. ముఖ్యమైన పాత్రలో జగపతిబాబు చేయనున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము" అని ఆయన చెప్పారు.