కావాలనే యుద్ధ నౌక దాచిపెట్టారు!

SMTV Desk 2019-05-31 13:52:55  donald trump, japan, america,

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జపాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జపాన్‌లోని నౌకా స్థావరాన్ని సందర్శించినపుడు యుద్ధ నౌక యుఎస్‌ఎస్‌ మెక్‌ కెయిన్‌ను తన దృష్టికి రానీయకుండా ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టారని అన్నారు. అరిజోనా మాజీ సెనేటర్‌ జాన్‌ మెక్‌ కెయిన్‌ పేరిట వున్న ఈ యుద్ధ నౌకను తాను ఇష్టపడనన్న ఉద్దేశంతోనే అధికారులు దానిని తన దృష్టినుండి తప్పించినట్లు కొందరు తనకు చెప్పారని ట్రంప్‌ ధృవీకరించారు. అమెరికా ఇండో-పసిఫిక్‌ కమాండ్‌కు చెందిన ఒక అధికారి ఈ మేరకు అధికారులకు మెయిల్‌ పంపిన విషయాన్ని ఉటంకిస్తూ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించిన కథనంపై స్పందించిన ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.