రాబర్ట్‌ముల్లర్‌ స్పందనపై ట్రంప్ అభిశంసించాలని పిలుపు

SMTV Desk 2019-05-31 13:51:40  donald trump, america, robert mueller

వాషింగ్టన్‌: 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు జరిపిన ప్రత్యేక సలహాదారు రాబర్ట్‌ముల్లర్‌ దానిపై తాజాగా తొలిసారి స్పందించారు. అయితే దీన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిశంసించాలని మరికొంతమంది డెమొక్రాట్‌లు పిలుపునిచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులు ఎలిజెబెత్‌ వారెన్‌, కమల హారిస్‌, బెటో రూర్కేతో సహా 40 మందికిపైగా ప్రతినిధులు ట్రంప్‌ అభిశంసనకు డిమాండ్‌ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ రష్యా సహకారం తీసుకున్నారనేదానిపై రెండేళ్లుగా మౌనం పాటిస్తున్న ముల్లర్‌ బుధవారం మాట్లాడుతూ ట్రంప్‌ ఏ తప్పు చేయలేదని తాను అనలేదని అన్నారు. ట్రంప్‌ న్యాయాన్ని అడ్డుకున్నారన్న దానిపై ఇంకా సందేహాలు నివృత్తి కాలేదని ముల్లర్‌ చెప్పారు. ట్రంప్‌ అభిశంసన విషయంలో డెమొక్రాటిక్‌ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ప్రతినిధుల సభ స్పీకర్‌, సీనియర్‌ డెమొక్రాట్‌నేత నాన్సీ పెలోసీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్‌ ఆధారాలుంటే తప్ప, అభిశంసన తీర్మానాన్ని అంగీకరించబోనని పెలోసి పేర్కొన్నారు అయితే ముల్లర్‌ వ్యాఖ్యల తరువాత ట్రంప్‌ను అభిశంసించాలన్న ప్రతిపాదనతో మరో ముగ్గురు డెమొక్రాట్‌ అధ్యక్ష అభ్యర్థులు గొంతు కలిపారు. దీనితో అభిశంసనకు పట్టుపడుతున్న వారి సంఖ్య పదికి చేరింది.