టూరిస్టు పడవ బోల్తా...ఏడుగురు మృతి

SMTV Desk 2019-05-31 13:51:06  tourist boat accident in budapest seven people died, Budapest boat crash leaves 7 South Korean tourists dead

బుడాపెస్ట్‌: బుడాపెస్ట్‌లో దారుణం చోటుచేసుకుంది. హంగరీ టూరిస్టు పడవ ప్రమాదానికి గురై మునిగిపోయింది. ఈ ఘటనలో 21 మంది గల్లంతు కాగా ఏడుగురు చనిపోయినట్లు ధ్రువీకరించారు. మరో ఏడుగురిని బయటకు తీసుకొచ్చారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. చనిపోయినవారంతా దక్షిణ కొరియాకు చెందినవారేనని ఆ దేశ విదేశాంగ మంత్రి కాంగ్‌ క్యూంగ్‌వా తెలిపారు. 60 మంది ప్రయాణికులను మాత్రమే తీసుకెళ్లగల ఈ తేలికపాటి టూరిస్టు పడవ బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. పెనుగాలులు, వర్షంతో డాన్యూబ్‌ నది కల్లోలంగా ఉండడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు.