ఏకధాటిగా 6 గంటలపాటు పబ్‌జి ఆడి గుండెపోటుతో ప్రాణం కోల్పోయాడు

SMTV Desk 2019-05-31 13:50:27  pubg, 12th standard boy died with heart attack while playing pubg in six hours

పబ్‌జి గేమ్ కు మరో ప్రాణం బలయింది. తాజాగా పబ్‌జి గేమ్ ఆడుతూ 16 ఏళ్ల అబ్బాయి మరణించాడు. గుండె పోటు ఇందుకు కారణం. పబ్‌జి గేమ్‌ను ఏకధాటిగా 6 గంటలపాటు ఆడటం వల్ల ఇతను మృతి చెందాడని వార్తలు వెలువడుతున్నాయి. మరణించిన అబ్బాయి పేరు ఫర్ఖాన్ ఖురేషి. ఇతనిది మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ పట్టణం. ఇతను 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఈ నెల 26వ తేదీన మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో భోజ‌నం చేసి ప‌బ్‌జి ఆట‌లో మునిగిపోయాడు. సాయంత్రం 7 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతణ్ని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళితే వైద్యులు మరణించినట్లు ధ్రువీకరించారు. ప‌బ్‌జి మొబైల్ గేమ్‌లో తీవ్రమైన భావావేశాల‌కు లోనుకావ‌ల్సి వ‌స్తుంది. అలాగే ఆ గేమ్‌లో ఓట‌మికి త‌ట్టుకోలేక ఖురేషీ మృతి చెందినట్లు తెలుస్తోంది.