గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్స్ పై భారీగా ధరలు తగ్గింపు!

SMTV Desk 2019-05-31 13:49:51  google, google pixel smartphones, google pixel 3, google pixel 3 xl

టెక్ దిగ్గజం గూగుల్ తన పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ పై భారీగా ధరలు తగ్గించింది. గూగుల్ పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో తగ్గింపు ధరతోనే అందుబాటులో ఉన్నాయి. గూగుల్ పిక్సల్ 3లో 64 జీబీ వేరియంట్ ధర రూ.12,001 తగ్గింది. ఇప్పుడు ఈ ఫోన్ రూ.58,999కు అందుబాటులో ఉంది. ఫోన్ అసలు ధర రూ.71,000. 128 జీబీ వేరియంట్ ధర ఏకంగా రూ.23,010 దిగొచ్చింది. ఇప్పుడు ఇది రూ.59,990కు కొనొచ్చు. గూగుల్ పిక్సల్ 3 ఎక్స్ఎల్ ఫోన్‌లో 64 జీబీ వేరియంట్ ధర భారీ రూ.27,501 తగ్గింది. ఇప్పుడు దీన్ని రూ.83,000కు కాకుండా రూ.55,499కు కొనొచ్చు. 128 జీబీ వేరియంట్ ధర రూ.13,000 దిగొచ్చింది. రూ.79,000కు అందుబాటులో ఉంది. అలాగే 64 జీబీ వేరియంట్ పరంగా గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ ఫోన్.. గూగుల్ పిక్సెల్ 3 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. పిక్సల్ 3 ధర రూ.58,999గా ఉంటే, పిక్సల్ 3 ఎక్స్ఎల్ ధర రూ.55,499గా ఉంది.