చైనా నుండి నేర్చుకోవాల్సింది చాల ఉంది!

SMTV Desk 2019-05-31 13:13:25  china

జాగ్రెబ్‌: స్పానిష్‌ విదేశాంగ మంత్రి జోసెప్‌ బారెల్‌ చైనా పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా నుండి ఐరోపా దేశాలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం క్రోయేషియా విదేశాంగ మంత్రి మరిజా పెజ్సినోవిక్‌ బ్యూరిక్‌తో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐరోపా వ్యవహారాలలో చైనా తన ప్రభావాన్ని చూపుతోందని, ఆ దేశం నుండి తాము నేర్చుకోవాల్సింది చాలా వుందని, తూర్పు ఐరోపాలో చైనా ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలపై తాము ఆసక్తి చూపుతున్నామని చెప్పారు. చైనా, ఐరోపా మధ్య ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలను అర్ధం చేసుకునేందుకు తన క్రోయేషియా పర్యటన మంచి అవకాశం కల్పించిందన్నారు.