భారత్‌కు జీఎస్పీ తొలగింపు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: అమెరికా

SMTV Desk 2019-05-31 13:12:50  america, india, trade, donlad trump

వాషింగ్టన్‌: భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ) తొలగింపు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ పాలనా వర్ఘం స్పష్టం చేసింది. కాగా ఈ మధ్యే మోడి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని తెలిపిన తరువాత ఇలా ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాగా భారత్‌కు జీఎస్పీ హోదా రద్దు ఇప్పటికే జరిగిపోయిన ప్రక్రియగ అని అధికారులు పేర్కొన్నారు. జీఎస్పీ హోదా రద్దు ఒక జరిగిపోయిన అంశం. ఇక దీనిపై ముందుకు ఎలా వెళ్లాలన్నదే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. మోదీ ప్రభుత్వంతో ఎలా నడుచుకోవాలి, ఈ విషయంలో ఉన్న ఇతర పరిష్కార మార్గాలేంటి? అన్న దానిపై సమాలోచనలు జరపాలిగగ అని ట్రంప్‌ పాలక వర్గంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ విషయంలో అమెరికా ఇచ్చిన 60 రోజుల గడువు మే 3తో ముగిసింది. అయితే భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు జీఎస్పీ రద్దుపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని కొందరు యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులు కోరడంతో దీనిపై తదుపరి నిర్ణయం ఆగిపోయింది. భారత్‌తో పాటు టర్కీకి కూడా విధించిన గడువు ముగియడంతో మే 17న ఆదేశానికి జీఎస్పీ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌లో ఎన్నికల ముగియడంతో ఇక త్వరలో ట్రంప్‌ నుంచి ఓ ప్రకటన రావచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.