నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు... పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్

SMTV Desk 2019-05-31 13:12:02  tamil hero

తనను హత్య చేస్తామని బెదిరిస్తున్నారని 8 తోట్టాగళ్ , తానా సేర్నద కూట్టం తదితర తమిళ చిత్రాల్లో నటించిన కథానాయిక మీరా మిథున్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. మిస్‌ సౌత్‌ ఇండియన్‌ కిరీటాన్ని దక్కించుకున్న తరువాత, తానే అందాల పోటీలను నిర్వహించడానికి సిద్ధం అవుతూ, మిస్‌ తమిళ్‌ దివా పేరిట పోటీలను ప్రకటించానని, అప్పటి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆమె తెలిపింది.

ఈ పోటీలను తాను సోమవారం నాడు నిర్వహించాలని భావించానని, ఇతర రాష్ట్రాల నుంచి తనకు, పోటీలో పాల్గొనే మహిళలకు బెదిరింపులు వస్తున్నాయని, గత వారం రోజులుగా వాటి తీవ్రత పెరిగిందని, చంపేస్తామంటున్నారని ఆమె వాపోయింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ఆమె, తాను నిర్వహించతలపెట్టిన అందాల పోటీలకు పోలీసులు భద్రత కల్పించాలని కోరింది.