కాబూల్‌లో కారు బాంబు పేలుడు...నలుగురు మృతి

SMTV Desk 2019-05-31 13:11:13  car bomb blasting in Kabul

కాబూల్‌: గురువారం కాబూల్‌ జిల్లాలోని పుల్‌-ఎ-చఖ్రీ రోడ్డుపై కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగుర్ ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 8:30 గంటలకు ఖాలాఇవజీర్ ప్రాంతంలో కారు బాంబు పేలుడు జరిగిందని, భద్రతాదళాల కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని జరిపిన పేలుడులో నలుగురు చనిపోగా..యూఎస్ సర్వీస్ మెన్ తోపాటు మరికొంతమంది గాయపడ్డారని అప్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నశ్రత్ రహిమి తెలిపారు. కాగా ఈ కారు బాంబు దాడులు ఎవరు చేశారనేది తెలియాల్సి ఉంది.