నేడు సచివాలయ ప్రవేశం... తొలిసారి సీఎం చైర్ పై జగన్!

SMTV Desk 2019-05-31 13:07:21  jagan

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి నేడు తొలిసారి సచివాలయంలో కాలుమోపనున్నారు. నిన్న సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జగన్, నేడు ఫస్ట్ టైమ్ సెక్రటేరియేట్ కు రానుండటంతో, పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. నేడు, రేపు ఆయన సచివాలయంలో ఉంటారని, పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటారని పార్టీ నేతలు ప్రకటించారు.

ఇక జగన్ కోసం సీఎం చాంబర్ ను అధికారులు సరికొత్తగా ముస్తాబు చేశారు. సీఎం చైర్ పై జగన్ తొలిసారి నేడు ఆసీనులు కానున్నారు. క్యాబినెట్ హాల్, హెలిపాడ్‌ లు, తాడేపల్లి నుంచి సచివాలయం వరకూ కాన్వాయ్ రూట్ సిద్ధమయ్యాయి. చాంబర్ ముందు సీఎం నేమ్ ప్లేట్‌ రెడీ అయింది. చాంబర్‌ లో మార్పులు, నేమ్ ప్లేట్ తదితరాలను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు.