బఫెట్ లంచ్ చేయాలంటే రూ.25 కోట్లు చెల్లించాలి!

SMTV Desk 2019-05-31 12:48:19  warren buffett

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ మారోమారు వార్తాల్లో నిలిచారు. వారెన్ బఫెట్‌తో కలిసి భోజనం చేయాలంటే ఏకంగా 3.5 మిలియన్ డాలర్లను (దాదాపు రూ.25 కోట్లు) చెల్లించాలంట. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ గురువు వారెన్ బఫెన్‌తో లంచ్ చేసేందుకు ఆసక్తిగల వారి కోసం ఆన్‌లైన్ ‌వేలంలో నిర్వహిస్తున్నారు. ఈబేలో ఆదివారం ప్రారంభమైన వేలం శుక్రవారం ముగుస్తుంది. సోమవారానికి వేలం 3.5 మిలియన్ డాలర్లకు చేరింది. వేలం సోమవారం ఇందులో వచ్చిన డబ్బును చారిటీ కోసం ఇస్తారు.వేలంలోని టాప్ బిడ్డర్ తనతోపాటు ఏడుగురు స్నేహితులను వారెన్ బఫెట్‌తో లంచ్ చేసేందుకు తీసుకెళ్లొచ్చు. న్యూయార్క్‌లోని స్మిత్ అండ్ వోలెన్‌స్కీ స్టీక్‌హౌజ్‌లో ఉంటుంది ఈ లంచ్. అత్యంత ఖరీదైన రెస్టారెంట్ ఇది.