వేగ బడ్జెట్ హెల్మేట్స్!

SMTV Desk 2019-05-31 12:42:02  vega, vega helmets, vega autom open face helmets

హెల్మెట్ల తయారీ సంస్థ వేగ తాజాగా అందుబాటు ధరకే అదిరిపోయే హెల్మెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా లాంచ్ చేసిన ఈ హెల్మెట్ల ధర రూ.692గా ఉంది. వేగ ఆటమ్ ఓపెన్ ఫేస్ హెల్మెట్లు బ్లాక్, డల్ బ్లాక్, పింక్, రెడ్, వైట్ వంటి రంగుల్లో లభ్యమౌతున్నాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. వీటి బరువు 750 గ్రాములు. ఈ హెల్మెట్లకు ఐఎస్ఐ ధ్రువీకరణ ఉంది. వీటి తయారీకి ఏబీఎస్ మెటీరియల్‌ను ఉపయోగించారు. దీంతో బైక్ మీద నుంచి కిందపడిన సందర్భాల్లోనూ మంచి రక్షణే లభిస్తుంది. విజర్‌ను పైకి కిందకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. విజర్ పెద్దగా ఉంటుంది. సిటీ రైడింగ్‌కు ఇవి చాలా అనుకూలముగా ఉంటాయి.