ఇక టీడీపీకి ఆ తారక రాముడే దిక్కు: రామ్ గోపాల్ వర్మ

SMTV Desk 2019-05-31 12:41:26  ntr

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ స్వీకరిస్తే ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని అందరూ మర్చిపోతారని ట్వీట్ చేశారు. మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది తారక్ ఒక్కరేనని వర్మ అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ కు తన తాతగారిపై ఏమైనా అభిమానం ఉంటే వెంటనే టీడీపీని రక్షించే బాధ్యతలను తన భుజాలపై వేసుకోవాలని సూచించారు.