ఘోర రోడ్డుప్రమాదం ... నలుగురు మృతి

SMTV Desk 2019-05-31 12:37:32  accident,

బాటోట్ – కిష్టావర్ జాతీయ రహదారిపై గురువారం అర్థ రాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో జమ్మూ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. లోయపడిన వాహనాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.