"హలో" టైటిల్ ఆలోచన ఆయనదేనట.!

SMTV Desk 2017-08-28 15:09:55  HELLO MOVIE, NAGARJUNA, AKHIL.

హైదరాబాద్, ఆగస్ట్ 28 : "అఖిల్" చిత్రంతో హీరోగా పరిచయమైన అక్కినేని అఖిల్ తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఆయన రెండో చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా కథలో భాగంగా హీరో, హీరోయిన్ తో హలో అని చెప్పించుకోవడం కోసం తాపత్రయ పడుతుంటాడట. దీంతో ఈ చిత్రానికి టైటిల్ "హలో" అయితేనే బాగుంటుందని నాగార్జున భావించి దర్శకుడికి చెప్పడంతో ఆయన వెంటనే ఓకే చెప్పేశారట. ఈ టైటిల్ యూత్ కి కనెక్ట్ అవడంతో నాగార్జున తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.