4 అడుగుల కొండచిలువను చూసి షాక్...... తెరుకునేలోపే ఘోరం జరిగిపోయింది

SMTV Desk 2019-05-31 12:34:29  snake

బాత్రూంలోకి వెళ్లి కమోడ్ సీట్ ఓపెన్ చేసిన ఓ వ్యక్తి అందులో నక్కి ఉన్న నాలుగు అడుగుల కొండచిలువను చూసి ఖంగుతిన్నాడు. తెరుకునేలోపే అతన్ని ఆ కొండచిలువ కాటేసింది. దాంతో హూటహూటిన ఆ వ్యక్తిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ కొండచిలువ విషపూరితమైనది కాకపోవడంతో బాధితుడికి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కొరల్ స్ప్రింగ్ పోలీస్ ప్రతినిధి క్రిస్ స్విన్సన్ స్పందించారు. కొండచిలువ అతడి అపార్ట్‌మెంట్‌లోకి ఎలా వెళ్లిందో తెలియదని, బాధితుడికి సంబంధించినది కూడా కాదని స్విన్సన్ చెప్పారు.

ప్రస్తుతం బాధితుడి కోలుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన కొండచిలువను కొరల్ స్ప్రింగ్ హూమానే సొసైటీ ప్రతినిధులు చికిత్స నిమిత్తం పశువైద్యుడి వద్ద తీసుకెళ్లారు. ఫ్లోరిడాలోనే ఇటీవల ఇదే కొవలో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన స్నేహితుడి ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొట్టగానే అక్కడే నక్కి ఉన్న ఓ పాము అతన్ని కాటేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంటి ముందు ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేసింది.