హాట్ ఫొటోలతో హీట్ పెంచుతున్న కాజల్ భామ

SMTV Desk 2019-05-31 12:31:04  Kajal

ఎంత చూసినా తనివి తీరని అందం కాజల్ అగర్వాల్‌ది. ఇటీవల ‘సీత’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ త్వరలోనే శర్వానంద్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. వయసు పెరిగినా అప్ కమింగ్ హీరోయిన్స్‌కు తిరుగులేని పోటీనిస్తోంది కాజల్ అగర్వాల్. స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నా ఇప్పటికీ కుర్ర హీరోల పక్కన కూడా క్యూట్‌గా నటిస్తోంది అంటే అర్ధం చేసుకోవచ్చు కాజల్ గ్లామర్, ఫిజిక్ ఎలాంటిదో. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ కూడా కాజల్ డైరీ ఇప్పుడు ఖాళీగా లేదు. తమిళంలో కాజల్ నటిస్తున్న ‘ప్యారిస్ ప్యారిస్’ విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ ‘క్వీన్’కు రీమేక్ ఇది. దీంతో పాటు ‘కోమలి’ అనే మరో సినిమాలోనూ నటిస్తోంది. తెలుగులోనూ మరో రెండు, మూడు ప్రాజెక్టులు కాజల్ చేతిలో ఉన్నాయి. సినిమాలతో బిజీగా ఉన్నా కూడా కాజల్ ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో జోరు ప్రదర్శిస్తోంది. డిఫరెంట్ ఫోటో షూట్స్ చేయించుకుని అదరగొడుతోంది. తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన కొన్ని హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.