రామ్ చరణ్ కు బ్రేక్ .. ఎన్టీఆర్ కసరత్తులు

SMTV Desk 2019-05-31 12:25:26  rrr

ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు హీరోలను కలిపి క్రేజీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. సినిమాకు ఆర్.ఆర్.ఆర్ అని టైటిల్ ఎనౌన్స్ చేసి దగ్గర నుండి ప్రతిది ఆడియెన్స్ తెలుసుకోవాలని ఎక్సైటింగ్ గా ఉన్నారు. రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ మూడవ షెడ్యూల్ జరుపుకోవాల్సి ఉంది. ఇంతలోనే చరణ్ కు కాలికి, ఎన్.టి.ఆర్ కు చేతికి గాయాలవడం సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ప్రస్తుతం చేసిన సినిమా వరకు గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారట రాజమౌళి. ఇక త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ మొదలు పెడతారని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో కేవలం ఎన్.టి.ఆర్ కు సంబందించిన సన్నివేశాలు మాత్రమే ఉంటాయట. ఎందుకు అంటే రాం చరణ్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో జాలీ ట్రిప్ లో ఉన్నాడు. ఆఫ్రికా ఖండంలో టాంజానియా లోని సెరెంగెటి నేషనల్ పార్క్ కు వెళ్లారు చరణ్, ఉపాసన.

అక్కడ ఈ జంట ఎంజాయ్ చేస్తున్నారట. ఎప్పుడూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే ఉపాసన మిస్టర్ సి తో సెరెంగెటి నేషనల్ పార్క్ లో వారు ఉన్న వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ట్రిపుల్ ఆర్ కు బ్రేక్ ఇచ్చి చరణ్ ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడని తెలుస్తుంది.