రాష్ట్రంలో నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు

SMTV Desk 2019-05-31 12:22:12  MLC elections, TRS,

రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాలలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగబోతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కౌంటింగ్ జూన్‌ 3న జరిపి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.

ఈ ఎన్నికలు 2014 ఓటర్ జాబితా ప్రకారమే జరుగుతుంది. ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా ఈ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకొంటారు.

తెరాస అభ్యర్ధులు: రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి తేరా చిన్నప్ప రెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు.

కాంగ్రెస్‌ అభ్యర్ధులు: రంగారెడ్డి: కొమ్మూరి ప్రతాపరెడ్డి, నల్గొండ: కోమటిరెడ్డి లక్ష్మి, వరంగల్: ఇంగుల వెంకట్రామిరెడ్డి(కాంగ్రెస్‌).

కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి, మునుగోడు నుంచి పోటీ చేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వరంగల్ నుంచి కొండా మురళీధర్ రావు ముగ్గురూ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి