కొరటాల శివ నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్

SMTV Desk 2019-05-31 12:21:35  Koratala shiva, Mahesh,

మహేష్ 26వ సినిమా.. ఇవాళ అనగా మే 31 సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే నాడు ముహుర్తం పెడతారని తెలుస్తుంది. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తారట. ఈ సినిమా తర్వాత మహేష్ 27వ సినిమా పరశురాం డైరక్షన్ లో ఉంటుందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం డైరక్షన్ లో మహేష్ సినిమా తెరకెక్కనుందట. అయితే ఈ సినిమా నిర్మాణంలో కొరటాల శివ కూడా భాగస్వామ్యం అవ్వాలని చూస్తున్నాడట.

తన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట. పరశురాం సినిమాకు అది కుదిరే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేంటి పరశురాం గీతా ఆర్ట్స్ ను వదిలి రాడు కదా అంటే మహేష్ కోరిక మేరకు నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేస్తారని తెలుస్తుంది. మహేష్ తో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు చేసిన కొరటాల శివ ఇప్పుడు మహేష్ సినిమా నిర్మించాలని అనుకుంటున్నాడు. అసలు కన్ ఫాం కాని పరశురాం మహేష్ సినిమాకు నిర్మాతల పోటీ బాగానే ఉంది.