మోదీ ప్రమాణస్వీకారానికి కాజల్ కు ఆహ్వానం... సారీ చెప్పిన హీరోయిన్

SMTV Desk 2019-05-31 12:00:54  modi

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించడంతో నరేంద్ర మోదీ రెండో పర్యాయం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ లో మోదీ ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం పీఎంవో నుంచి వివిధరంగాల ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఇన్విటేషన్ అందుకున్నవారిలో ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఉన్నారు. అయితే, మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యే విషయంలో ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు.

ఢిల్లీకి సకాలంలో చేరుకోలేని పరిస్థితిలో ఉన్నానని, అందుకే రాలేకపోతున్నానని కాజల్ ట్వీట్ చేశారు. "ప్రియమైన మోదీ గారూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. కానీ, మీ ప్రమాణస్వీకారం సమయానికి నేను చేరుకోలేకపోవచ్చు. అందుకే హాజరు కావడంలేదు. క్షమించండి. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూడలేనందుకు ఎంతో బాధగా ఉంది. అయితే మీరు చరిత్ర సృష్టించే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.