వన్డేల్లో 7వేల పరుగుల చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్‌ మోర్గాన్

SMTV Desk 2019-05-31 11:49:35  morgan england captain

లండన్‌: ఐసిసి ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ సౌతాఫ్రిక, ఇంగ్లాండ్ దేశాల మధ్య జరుగుతున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ కెప్టెన్‌, బ్యాట్స్‌మన్ ఇయాన్ మోర్గాన్ వన్డేల్లో 7వేల పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్ ఎంగిడి వేసిన 26వ ఓవర్‌లో మోర్గాన్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో అతనికి బెన్ స్టోక్స్ కూడా చక్కని సహకారం అందిస్తున్నాడు. కాగా 28 ఓవర్లలో ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.