సెక్స్ చేయలేదని భర్తను చితకబాదిన భార్య

SMTV Desk 2019-05-31 11:48:06  wife beats her husband due to his doing sex with her

అమెరికా: తనతో సెక్స్ చేయలేదని ఓ భార్య తన భర్తని చావాబాదింది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...ఓ మహిళా ఇంటికి ఫుల్లుగా తాగొచ్చి తన పిల్లల ముందే భర్తతో అసభ్యకరంగా ప్రవర్తించడం, అలాగే తనతో సెక్స్ చేయమని వారించింది. తన పిల్లల ముందు అలా చేయడం చూసి విసిగిపోయిన భర్త దానికి తిరస్కరించానని చెప్పాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన ఎరికా తన భర్తను చేతికి అందిన వస్తువు తీసుకుని చితక్కొట్టింది. అయితే అంతటితో ఆగకుండా ఏకంగా పోలీసులకు తానే స్వయంగా ఫోన్ చేసి భర్త తనపై దాడి చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫోన్ మేరకు పోలీసులు హుటాహుటిన వాళ్ల ఇంటికి వెళ్లారు.అయితే అక్కడికి వెళ్లిన పోలీసులు ఆమెను గమనించారు. అయితే ఆమె ఒంటిపై ఒక్క దెబ్బ కూడా లేకపోవడంతో అనుమానంతో పోలీసులు ఇంటిలోని పిల్లలను ఏం జరిగింది అని అడగ్గా దానికి సమాధానంగా పిల్లలు మా డాడీ ఎలాంటి దాడి చేయలేదని, మా మమ్మీయే డాడీపై దాడి చేసిందని చెప్పారు. దాడికి సంబంధించి భర్తను వివరాలు అడిగిన పోలీసులు భర్త చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు. సదరు మహిళ మద్యంతో పాటు డ్రగ్స్ కూడా తీసుకుని ఉంటుందని అనుమానించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.