తమిళ బిగ్ బాస్ కు అతిధిగా మహేశ్ బాబు..?

SMTV Desk 2017-08-28 14:24:35  PRINCE MAHESH BABU, TAMIL BIGBOSS SHOW, GUEST, SPIDER MOVIE PROMOTIONS.

హైదరాబాద్, ఆగస్ట్ 28 : ఏఆర్ మురు‌గ‌దాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం "స్పైడర్". రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మి౦చారు. అంతేకాకుండా అటు హిందీ, మలయాళ, అరబిక్ భాషల్లోకి అనువాదం చేసారు. ఈ సందర్భంగా తమిళంలో విడుదలవుతున్న తన "స్పైడర్" చిత్ర ప్రచారం కోసం మహేష్ తమిళ "బిగ్‌బాస్‌" కార్యక్రమానికి అతిధిగా వెళ్లనున్నట్లు ఫిలింనగర్ సమాచారం. కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రిన్స్ తన చిత్ర ప్రచారం కోసం రావడం పట్ల తమిళ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన తెలియరాలేదు. కాగా ఈ చిత్ర ఆడియోను సెప్టెంబర్ 8 న, చిత్రాన్ని 27 న విడుదల చేయనున్నారు.