ఫ్రెండ్ కి చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డ ఎన్నారై మహిళ

SMTV Desk 2019-05-31 11:45:42  suicide

షార్జా: షార్జాలో ఓ ఎన్నారై మహిళ ఫ్రెండ్ కి చెప్పి మరి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం...మర్జోనా అనే మహిళ షార్జాలోని ఓ స్కూలులో ఇంగ్లీష్ టీచర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఆమెకు భర్తతో గొడవ జరగడంతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది. ఆమె ఇద్దరు పిల్లలు ఇండియాలో ఉన్న భర్త దగ్గరే ఉంటున్నారు. దీంతో మనస్థాపానికి గురైన మహిళ స్నేహితునికి ఫోన్ చేసి చనిపోతున్నాని చెప్పడమే కాకుండా వాట్సాప్ లో ఉరివేసుకుంటున్న పోటోను కూడా మెసేజ్ చేసింది. దీంతో వెంటనే ఆమె ప్లాట్ కు వెళ్లి చూసే సరికి ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. తక్షణమే ఆమెను దగ్గరలోని దవాఖానకి తరలించాడు. అప్పటికే మహిళ మరణించిన్నట్టు వైద్యులు వెల్లడించారు. అనంతరం ఆమె మిత్రుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.