జూమ్‌కార్ ఆఫర్...100% డిస్కౌంట్‌

SMTV Desk 2019-05-30 19:38:42  zoomcar

కార్స్ బుకింగ్ సంస్థ జూమ్‌కార్ సెల్ఫ్ డ్రైవ్ బుకింగ్స్‌కు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా 100 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. కంపెనీ ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. జూమ్‌కార్ డిస్కౌంట్ ఆఫర్ మే 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే కనీసం 12 గంటల కారును బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న కారుతో జూన్ 8 నుంచి నవంబర్ 25 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఒకవేళ మీరు ట్రిప్‌ను రద్దు చేసుకున్నా కూడా ఎలాంటి క్యాన్సలేషన్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కంపెనీ 100 శాతం తగ్గింపు ఆఫర్‌లో 50 శాతం క్యాష్‌బ్యాక్ రూపంలోనూ మరో 50 శాతం డిస్కౌంట్ రూపంలోనూ ఉంటుంది. ఈ ఆఫర్‌ను పొందాలంటే యూజర్లు ‘ఎల్‌యూవీ100’ ప్రోమో కోడ్‌ను ఉపయోగించాలి. కంపెనీ కేవలం డిస్కౌంట్ మాత్రమే కాకుండా కస్టమర్లకు మరో ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ సేల్‌లో భాగంగా లక్కీ కస్టమర్లకు ఉచిత ఫ్లైట్ వోచర్‌ కూడా అందిస్తోంది. ప్రతి రోజూ ఒక లక్కీ కస్టమర్‌ను ఎంపిక చేస్తారు. ఈ వోచర్‌తో పేటీఎంలో ఫ్లైట్ బుక్ చేసుకొని 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.