మోదీతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోయేది వీరే!

SMTV Desk 2019-05-30 19:36:16  modi

లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎన్డీయే కూటమి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ సాయంత్రం మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొందరు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టు సమాచారం.

ఈ మేరకు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, అబ్బాస్ నఖ్వీ, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, జితేందర్ సింగ్, రాంవిలాస్ పాశ్వాన్, సదానంద గౌడ, ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, బాబుల్ సుప్రియో, అర్జున్ మేఘ్వాల్, అనుప్రియ, సురేశ్ అంగడి, సాధ్వీ నిరంజన్ జ్యోతి, కైలాష్ చౌదరిలకు పీఎంఓ నుంచి ఫోన్ ద్వారా సందేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది.

ఈ సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మోదీ నివాసంలో నూతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. కొత్త మంత్రివర్గ సభ్యులను ఉద్దేశించి మోదీ ప్రసంగం అయ్యాక అక్కడి నుంచి రాష్ట్రపతిభవన్ కు పయనమవుతారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమక్షంలో మోదీ ప్రధానిగా, ఇతరులు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు.