జగన్, కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు

SMTV Desk 2019-05-30 19:20:59  jagan, kcr,

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌ల ఢిల్లి పర్యటన రద్దయింది. రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సి ఉండగా, ఢిల్లి విమానం ల్యాండింగ్‌కు అనుమతి లేని కారణంగా ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు తమ ఢిల్లి పర్యటనను రద్దు చేసుకున్నారు. షెడ్యూల్‌లో లేని విమానాల ల్యాండింగ్‌కు పౌర విమానానయాన శాఖ, డీజీసీఏ అనుమతులు రద్దు చేసింది. దీంతో జగన్‌, కేసీఆర్‌ల ఢిల్లి పర్యటన రద్దయింది. ఇక ఈరోజు రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 7 గంటలకు మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రులు, డీఎంకే అధినేత స్టాలిన్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరైన సంగతి తెలిసిందే. ప్రమాణస్వీకారం కార్యక్రమం అనంతరం తాడేపల్లిలోని ఆయన నివాసంలో సీఎం కేసీఆర్‌, స్టాలిన్‌కు విందు ఏర్పాటు చేశారు. ఇక ఢిల్లీ పర్యటన రద్దు కావటంతో.. సీఎం కేసీఆర్ విజయవాడ నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరనున్నారు.