ఫలితాల తర్వాత...... తొలిసారిగా విపక్షాల సమావేశం

SMTV Desk 2019-05-30 19:20:14  congress

ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత తొలిసారిగా విపక్షాలు సమావేశం కానున్నాయి. రేపు ఢిల్లీలోని పార్లమెంటు హాలులో ప్రతిపక్షాలు భేటీ అవ్వాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరిగే ఈ సమావేశంలో ఓటమికి దారితీసిన కారణాలపై ఉమ్మడిగా విశ్లేషించనున్నారు. కొన్ని పార్టీలు ఎన్నికల పరాజయంపై సొంత సమీక్షలు జరుపుకున్న సంగతి తెలిసిందే. తదుపరి కార్యాచరణపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

మరోసారి ఈవీఎంలు, వీవీప్యాట్ల గురించి ఈ భేటీలో ప్రస్తావన వచ్చే అవకాశముంది. ఫలితాల సందర్భంగా ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య తేడా వచ్చిందన్న విషయాన్ని విపక్షాలు చర్చించనున్నాయి. కాగా, ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యే విషయంలో ఇంకా స్పష్టతరాలేదు. ఈవీఎంలు, వీవీప్యాట్ల అంశంపై చంద్రబాబే ముందు నిలబడి పోరాటం చేసిన సంగతి తెలిసిందే.