ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష: ట్రంప్ ట్వీట్ కి భిన్నంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన

SMTV Desk 2019-05-30 19:14:53  north korea missile test, donald trump

వాషింగ్టన్‌: ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలపై ఆందోళన చెందాల్సిన పనిలేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ట్వీట్ కు వ్యతిరఖంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల జేసింది. ఉత్తర కొరియా ప్రయోగాలు బాలిస్టిక్‌ క్షిపణులకు సంబంధించినవా లేక సామూహిక విధ్వంసక ఆయుధ సంపత్తి (డబ్ల్యుఎండి) సంబంధించినవా అనే విషయాన్ని వెల్లడించేందుకు విదేశాంగ శాఖ ప్రతినిధి మోర్గాన్‌ ఆర్టగస్‌ నిరాకరించారు. అయితే ఉత్తర కొరియా సామూ హిక విధ్వంసక ఆయుధ(డబ్ల్యుఎండి) కార్యక్రమం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలతో విభేదిస్తున్నదని భావిస్తు న్నాను అని ఇక్కడ విలేకరులతో ఆమె అన్నారు. ఉత్తర కొరియా డబ్ల్యుఎండి కార్యక్రమానికి శాంతియుత ముగింపు పలకాలనే లక్ష్యంతో కిమ్‌కు, ట్రంప్‌కు మధ్య సానుకూల సంబంధాలను అమెరికా కోరుకుంటున్నదని ఆమె చెప్పారు. తాము అక్కడున్నంత కాలం ఆర్ధిక ఆంక్షలు కొనసాగుతాయని పలుమార్లు చెబుతూనే ఉన్నామన్నారు. గత వారాంతంలో కిమ్‌ జపాన్‌ చేరుకున్న తరువాత ట్రంప్‌ ఒక ట్వీట్‌ చేస్తూ ఉత్తర కొరియా కొన్ని చిన్న ఆయుధాలను పరీక్షించిందని, అది తమ ప్రజలను, ఇతరులను ఆందోళనకు గురిచేసిందని అన్నారు.