వాతావరణ మార్పుల సదస్సుకు సానుకూల స్పందన

SMTV Desk 2019-05-30 19:13:54  United Nations

వాతావరణ మార్పుల సదస్సుకు ప్రపంచ దేశాల నుండి సానుకూల స్పందన లభిస్తుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రత్యేకదూత లూయిస్‌ అల్ఫాన్సో డి ఆల్బా వ్యక్తం చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఇచ్చిన పిలుపునకు సానుకూల స్పందన వ్యక్తమైనందున ఇప్పుడీ సదస్సుకు కూడా సానుకూల స్పందన లభిస్తుందని ఆశిస్తున్నట్లు అల్ఫాన్సో డి అల్బా తాజాగా ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సదస్సుకు హాజరయ్యే దేశాలన్నీ ఈ సదస్సులో తీసుకోవాల్సిన నిర్దిష్ట చర్యలను గుర్తించారని, చర్చల దశ నుంచి కార్యాచరణపైపు మళ్లేందుకు అందరూ సుముఖంగా ఉన్నారని ఆయన చెప్పారు.