నేనింకా యూతే: రవిశాస్త్రి

SMTV Desk 2019-05-30 19:12:27  chahal interview with ravi shastri

వరల్డ్ కప్‌ టోర్నీలో జూన్ 5న జరగనున్న తొలి మ్యాచ్‌కు టీమిండియా సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ప్రాక్టీస్‌లో భాగంగా బయల్దేరింది. ఆ బస్సులో సరదాగా ప్లేయర్లను ఇంటర్వ్యూలను నిర్వహించాడు చాహల్. ఈ కార్యక్రమంలో రవిశాస్త్రి కూడా పాల్గొన్నాడు. దాంతో ప్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిన రవిశాస్త్రి తాను ప్లేయర్‌గా ఉన్నప్పటి సంగతులు గుర్తు చేసుకున్నాడు. ఇంగ్లాండ్ టూర్ అంటే మీరు ఎలా ఫీలవుతున్నారని అడిగిన ప్రశ్నకు.. 20ఏళ్ల క్రితం ఇదే రోడ్డుపై ప్రయాణించిన జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయని రవిశాస్త్రి బదులిచ్చాడు. ఆ మాటకు చాహల్ అవును మీరు యూత్‌లో ఉన్నప్పటి సంగతి గురించి చెప్తున్నారా.. అని అడిగితే.. దానికి నేనింకా యూతే అని రవిశాస్త్రి చెప్పుకొన్నాడు. మంగళవారం ధోనీతో పాటు టీమిండియా ప్లేయర్లతో చేసిన ఇంటర్వ్యూలు పోస్టు చేసింది బీసీసీఐ. మే30న టీమిండియా హెడ్ కోచ్, సహాయక సిబ్బందిల ఇంటర్వ్యూలను చాహల్ టీవీ పేరుతో పోస్టు చేసింది. మే30న ఇంగ్లాండ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా, భారత్ జూన్ 5న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది.