ప్రపంచ ప్రారంభ వేడుకలపై విమర్శలు

SMTV Desk 2019-05-30 19:11:14  ICC WORLD CUP 2019 open ceremony celebrations

ప్రపంచ ప్రారంభ వేడుకలు బుధవారం బకింగ్ హాల్‌కి సమీపంలో ఉన్న లండన్‌ మాల్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలు ఆశించిన గ్రాండ్‌గా లేవని క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు.ఒలింపిక్స్, పుట్‌బాల్ వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలతో పోలుస్తూ 12వ ఎడిషన్ ఆరంభ వేడుకలు నిరాశపరిచాయని అంటున్నారు. చివరగా 1999లో ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్‌కప్ ఆరంభ వేడుకలతో బుధవారం జరిగిన ప్రారంభ వేడుకలను పోల్చిచూస్తే పెద్దగా ఆకట్టుకోలేదని మండిపడుతున్నారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ ప్రారంభ వేడుకలకు అభిమానులు వేలాదిగా తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది.