మోటారోలాకు అమెజాన్ షాక్....లాంచ్ చెయ్యకముందే అమ్మకాలు

SMTV Desk 2019-05-30 19:05:45  Motorola, amazon,

ఈ-కామర్స్ సంస్థ దిగ్గజం అమెజాన్ మోటారోలా కంపెనీకి షాక్ ఇచ్చింది. మోటారోలా మోటో జెడ్4 స్మార్ట్ఫోన్ ను అధికారికంగా లాంచ్ చేయకముందే అమెజాన్ తన ప్లాట్‌ఫామ్‌పై విక్రయానికి ఉంచింది. ఒక యూట్యూబర్ 499.99 డాలర్లకు (దాదాపు రూ.35,000) ఈ ఫోన్ కోసం అమెజాన్‌లో ఆర్డర్ ఇచ్చారు. అమెజాన్ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ ప్రకారం.. మోటో జెడ్4 స్మార్ట్‌ఫోన్‌లో 6.4 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఫాస్ట్ చార్జ్ సపోర్ట్, స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. విషయం తెలుసుకున్న అమెజాన్ తర్వాత మోటో జెడ్4 స్మార్ట్‌ఫోన్‌ను ప్లాట్‌ఫామ్ నుంచి డీలిస్ట్ చేసింది. ఇకపోతే మోటో జెడ్4 స్మార్ట్‌ఫోన్ 5జీ మోటో మోడ్‌ను సపోర్ట్ చేస్తుంది.