భారత్ లో లాంచ్ కానున్న రియల్‌మి ఎక్స్‌

SMTV Desk 2019-05-30 18:58:27  Realme X

రియల్‌మి మరో నూతన స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఎక్స్‌ను భారత్ లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘రియల్‌మి ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను వీలైనంత త్వరగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ ఏడాది రెండో ఆర్ధ భాగంలో ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేస్తాం’ అని రియల్‌మి ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాధవ్ సేత్ ట్విటర్ వేదికగా తెలిపారు. ఇకపోతే రియల్‌మి ఇటీవల బీజింగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రియల్‌మి ఎక్స్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ ధర రూ.15,300 నుంచి ప్రారంభమౌతోంది. 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. రియల్‌మి ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 48 ఎంపీ రియర్ కెమెరా, 16 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, ఫుల్‌వ్యూ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలున్నాయి.