ఐసిసి వరల్డ్‌కప్‌ థీమ్ సాంగ్....వైరల్

SMTV Desk 2019-05-30 18:43:03  icc world cup 2019 theme song

గురువారం ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ మెగా టోర్నీ ప్రాప్రాంభం కానుంది. ఇక ఈ టోర్నీలో ఆతిథ్యం ఇస్తున్న ఇంగ్లాండ్ జట్టుతో దక్షిణఆఫ్రికా ఆరంభ మాత్చ్ ఆడనుంది. అయితే ఈ టోర్నీకి ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఐసిసి ప్రపంచకప్ 2019 థీమ్ సాంగ్ ఒకటి విడుదల చేయగా అది విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ట్రోఫీ గెలుచుకున్న జట్లతో పాటు మెగా టోర్నీలో పాల్గొన్న అన్ని జట్ల సన్నివేశాలను చూపించారు. ఇక ఈ వీడియో చాలామందికి ఒక మత్తులా ఎక్కుతుంది.